7టీవీ ఫోకస్, ఆంధ్రప్రదేశ్, జూన్ 30: బాపట్ల జిల్లా అభివృద్ధి, కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడం, పార్టీ బలోపేతంపై బాపట్ల పార్లమెంట్ పరిధి ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎంపీ, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారధి అధ్యక్షతన నిర్వహించిన బాపట్ల పార్లమెంట్ టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాపట్ల పార్లమెంట్ సభ్యుడు, లోక్సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లే విధానాలు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

