రాజముద్రతో పాసు పుస్తకాలు రైతులతో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బహూకరణ జంగారెడ్డిగూడెం
7 టివి ఫోకస్ జూలై 2

జగన్ ఫోటో పోయింది రాజముద్ర వచ్చింది ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఏ పోలవరంలో రైతుల సంబరం కొత్త పాసు బుక్స్ అందజేత పారదర్శక పాసు బుక్స్ పంపిణీ రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది ఎమ్మెల్యే రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామ రైతులకు గురువారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు రీ సర్వే నిర్వహించి తప్పులు సరిదిద్దిన అనంతరం రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకుల ఫోటోలతో పాసు పుస్తకాలు ఇవ్వగా కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఎటువంటి ఫోటోలు లేకుండా రాజముద్రతో ఇస్తోందని ఆయన తెలిపారు రైతుల భూములకు భద్రత కల్పించడం బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు సులభంగా అందేలా చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు భూ రికార్డుల ప్రక్షాళనతో భవిష్యత్తులో వివాదాలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలు అందడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రైతులకు మేలు జరిగేలా నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు మండల కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు పాసు పుస్తకాలు అందుకున్న రైతులు ఎమ్మెల్యేకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు

