పలు బస్తీలలో ఈరోజు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) వెరిఫికేషన్ ప్రక్రియ లో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటరు మహాశయులకు ఓటరు జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, పేరు, వయస్సు, ఇతర వివరాల సవరణ, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే విధానం, అవసరమైన పత్రాలు, వెరిఫికేషన్ ప్రక్రియ తదితర అంశాలపై ప్రజలకు సమగ్రంగా వివరించి అవగాహన కల్పించారు. అదేవిధంగా స్థానిక అన్ని పార్టీల నాయకులు వెల్ఫేర్ కమిటీ సభ్యులు బిఎల్ఓ లకు సహకరించి ఎండిమేరేషన్ ఫామ్ లు గడపగడపకు చేర్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి బూతులు చాలా ఓట్లు వేరే బస్తీలలో ఉండడం వలన బిఎల్వోలు ఇబ్బంది పడకుండా వారికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి గారు లావణ్య గారు భద్రప్ప గారు ప్రశాంత్ గారు శివకుమార్ గారు సుభద్ర గారు ధనలక్ష్మి గారు భాగ్య గారు విద్య గారు తదితరులు పాల్గొన్నారు.

