7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 6: తెలంగాణ భవన్లో వర్ధంతి కార్యక్రమం – చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ నాయకులు భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు సోమవారం తెలంగాణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ బాబు జగ్జీవన్‌రామ్ దేశ రాజకీయ, సామాజిక రంగాలకు అందించిన సేవలను స్మరించుకున్నారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని బాబు జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళులర్పించారు.

