మామిళ్లకుంటలో పట్టాదారులకు పాసు పుస్తకాలు అందజేసిన ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర
తుగ్గలి, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్) తుగ్గలి మండల పరిధిలోని మామిళ్లకుంట గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎడవెల్లి తిమ్మప్ప ఆధ్వర్యంలో పట్టాదారులకు కొత్త భూ పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర అర్హులైన రైతులకు కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల భూ హక్కులను మరింత భద్రపరిచే దిశగా ప్రభుత్వం పారదర్శకంగా పాసు పుస్తకాల పంపిణీ చేపడుతోందని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులు పి. వెంకటపతి, కొట్టాల వెంకట్రామ చౌదరి, కొమ్మ వెంకటేష్, సంఘాల కృష్ణ, వల్లే వెంకటేష్, బెస్త కృష్ణయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

