సిపిఐ ఆధ్వర్యంలో దేశ రాజధాని డిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా లో భాగంగా సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ రోజు నిజాంపేట్ సర్కిల్ వద్ద “బద్లావ్ జరూరి హై” (మార్పుకావాలి.) కేంద్ర ప్రభుత్వం అవాలంబిస్తున్న ప్రజా వెతిరేక విధానాలను నిరసనగా ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ బీజేపీ ఏర్పాటు చేసి 12 సంవత్సరలు దాటినా ఇప్పటికి పేద ప్రజలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. పేద ప్రజలకు వెతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మోడీ పాలనా కొనసాగుతుంది అని గుర్తుచేశారు. ప్రభుత్వ సంస్థలు అని ప్రవేటికరిస్తున్నారు కార్మికలకు వెతిరేకంగా కార్మిక చట్టాలు తెచ్చారు. రైతులకు వెతిరేకంగా రైతు చట్టాలు తెచ్చారు. ఇప్పుడు అమెరికతో పత్తి కొనుగోలు ఒప్పందం చేశారు. మరీ భారత దేశంలో పండిన పత్తి ఎక్కడ అమ్మాలో మోడీ గారు చెప్పాలి అని ప్రశ్నించారు. కనుక సెప్టెంబర్ 1వ తేదీన జంతర్ మంతర్ దగ్గర జరిగే ఛలో డిల్లీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గోని ప్రజల అనుకూల ప్రభుత్వాని ఏర్పాటు చేసుకునే దిశగా మనం ముందుకు పోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ ఏఐటీయూసీ కన్వీనర్ పొన్నకంటి దస్తగిరి, వెంకటేష్, యాకన్న, మల్లన్న, కృష్ణ, యదన్న, నర్సమ్మ, సత్తమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

