7టీవీ ఫోకస్9-8- నిజాంపేట్: నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ఇంద్రన్న కాలనీలో ఆషాడ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

జై మహంకాళి! జై బోనాలు!
ఈ కార్యక్రమంలో ఇంద్రన్న కాలనీ అధ్యక్షులు పాలభిందెల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రంగనాయక్, కమిటీ సభ్యులు శ్రీరామ్ రెడ్డి, పి.మల్లేష్, కరుణాకర్ రెడ్డి, గట్టయ్య, నర్సింహా, నాగేష్, కొండలు, మహేష్, వెంకట్ రెడ్డి, కె. మల్లయ్య, శంకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

