గణేష్ నగర్లో శరత్ మరియు శ్రీకాంత్ గార్ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నూతన అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి గారితో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి నగర్లో బీజేపీ రాష్ట్ర OBC సెల్ జనరల్ సెక్రటరీ నందనం దివాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా స్థానిక భక్తులు, మహిళలు, యువత, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి పండుగలు ప్రజలందరిలో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తాయి.ఈ కార్యక్రమాల్లో కట్ట కుమార్ గారు, పులి బలరాం గారు, తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గణేష్ నగర్, రంగారెడ్డి నగర్ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలి.
జై అమ్మవారు!
నల్ల జై శంకర్ గౌడ్
బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నాయకులు

