చెన్నై7tv focus : ‘బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారతదేశానికి పునాది’ అని తమిళనాడు సీఎం విజయ్ అభివర్ణించారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతూ పలు కీలక అంశాలు లేవనెత్తారు.
- హకార సమాఖ్య విధానమే దేశ బలానికి పునాది అని వ్యాఖ్యానించారు. కేంద్రం – రాష్ట్రాలు, రాష్ట్రాల మధ్య విభేదాలను చర్చలు, పరస్పర గౌరవం, చట్టబద్ధ విధానాల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
- డీలిమిటేషన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు.
- నీట్ పరీక్షకు వ్యతిరేకత.. తమిళనాడు రాష్ట్ర కోటాలోని MBBS, BDS, ఆయుష్ సీట్లను కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగానే భర్తీ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరారు.
- ఆర్థిక పంపకాలలో న్యాయం జరగాలి.. మెరుగ్గా పనిచేస్తున్న రాష్ట్రాలకు నష్టం జరగకుండా, వాటికి మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
- GST రేట్ల నిర్ణయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
- అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై దృష్టి.. దిగువ ప్రాంత రాష్ట్రాల హక్కులను కాపాడాలని, సుప్రీంకోర్టు తీర్పులు, ట్రిబ్యునల్ అవార్డులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కావేరి, ముల్లై పెరియార్ వివాదాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
- డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉమ్మడి పోరాటం అవసరమని పిలుపు. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయాలపై కఠిన నియంత్రణతో పాటు, రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి పెంచాలని సూచించారు.

