హైదరాబాద్ 7tv focus : వర్షాకాలం వచ్చిందంటే నగరంలో ముంపు భయంతో వణికేవాళ్లు కొందరైతే.! శిథిలావస్థలోని వారసత్వ కట్టడాలు కనుమరుగవుతాయేమోనని బాధపడేవాళ్లు మరికొందరు. వానాకాలంలో ప్రతియేటా ఒక్కొక్క చారిత్రక జ్ఞాపకం నేలమట్టమవుతున్నది. గడిచిన పదేళ్లలో అత్యంత అరుదైన ఐదు వారసత్వ కట్టడాలను నగరవాసులు కోల్పోయారు.
ప్రజాప్రయోజనంలోకి తీసుకురావాలని..
హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని వారసత్వ పరిరక్షణ కమిటీ గుర్తించిన 142 చారిత్రక కట్టడాల్లో ఇదీ ఒకటి. ఇన్‌ట్యాక్ సంస్థ ప్రతినిధులు 2013లో మహబూబ్ మాన్షన్‌ను తనిఖీ చేశారు. ఆ భవనాన్ని ప్రజాప్రయోజనంలోకి తీసుకువచ్చేందుకు, అక్కడ ఆహారశాలలు, పురావస్తు వస్తువుల ప్రదర్శనశాల, నగర సంస్కృతిని తెలిపే వస్తువుల విక్రయశాలలు ఏర్పాటు చేస్తే, అదొక పర్యాటక స్థలంగా విరాజిల్లుతుందని ఆర్కిటెక్టు విద్యార్థులు సూచించారు. అయినా, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. భవన సముదాయంలోని ఒక్కో నిర్మాణం కూలుతోంది. అలా నిరుడు మహబూబ్ మాన్షన్‌పై అంతస్తులోని ముందుభాగం నేలమట్టమైంది. ఇలాగే వదిలేస్తే, మరికొద్ది రోజుల్లోనే ఆ భవనం పూర్తిగా కనుమరుగవుతుందనడంలో సందేహం లేదు. మహబూబ్ మాన్షన్‌ను పునరుద్ధరించాలని చరిత్ర అధ్యయనకారులు కోరుతున్నారు.
2018, ఆగస్టు నెలలో వందేళ్ల గౌలీగూడ బస్టాండ్ నేలమట్టమైంది. తర్వాత 160ఏళ్ల సుల్తాన్‌బజార్ స్కూలు కూలింది. మరొక సందర్భంలో చార్సౌ సాల్ చరిత కలిగిన గోల్కొండ కోటలోని రెండు బురుజులు పడిపోయాయి. చారిత్రక భవనాలు మరెన్నో శిథిలావస్థకు చేరాయి. రేపోమాపో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వందల ఏళ్ల నాటి నిర్మాణాలను పరిరక్షించేందుకు అధునాతన టెక్నాలజీ ఇంగ్లండ్ తదితర దేశాల్లో అందుబాటులో ఉందంటారు కన్జర్వేటీవ్ ఆర్కిటెక్ట్ తురగా వసంత శోభ. ప్రకృతి విపత్తుల సమయంలో వారసత్వ కట్టడాలను పరిరక్షించడం ‘కన్జర్వేషన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్’ పాలసీలో భాగం. అందుకు ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్నూ రూపొందించారు. అయితే, ఆ సాంకేతిక పరిజ్ఞానం మన దేశంలో అందుబాటులో లేదని నిపుణుల చెబుతున్నారు.

