తెలంగాణ 7tv focus : తెలంగాణలో కొత్త ‘చేయూత’ పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మొదట నిర్ణయించిన ఆఖరి తేదీ ఆగస్టు 31 (ఈరోజే) కావడంతో చాలా మంది లబ్ధిదారులు ఆందోళనతో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ నేపథ్యం లో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. Also Read సెప్టెంబర్ 1 పెన్షన్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన – కొత్తగా వీరికీ పంపిణీ..!! కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అర్హులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. కాగా, ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల మంది సామాజిక పింఛన్లను కొత్తగా అందించాలని ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

