7tv focus : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును వేదికగా చేసుకుని భారత్ వ్యూహాత్మకంగా, నైతికంగా నాయకత్వం వహించే దిశగా సాగాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మరింత బలంగా చాటుకోవాలని సూచించింది. గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్ చిత్తశుద్ధితో పనిచేయాలని కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యనించారు .భారతీయ వస్తువులు, సేవల ఎగుమతులకు బ్రిక్స్ మార్కెట్లలో సమాన ప్రాధాన్యత దక్కేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనుసరించిన సమతుల్య విదేశాంగ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం బ్రిక్స్ సదస్సులో మద్దతు సాధించాలన్నారు.

