7tv focus : ఇంట్లో పనులు చేయకపోవడంపై కుమార్తెను తండ్రి మందలించాడు. ఈ గొడవ సందర్భంగా ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టాడు. ఆగ్రహించిన కుమార్తె కుక్కర్ మూతతో తండ్రి తలపై పలుసార్లు కొట్టింది. కత్తితో పొడిచి ఆయనను హత్య చేసింది. పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేశారు.గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 31న రాత్రి 10.30 గంటల సమయంలో అమ్రోలి ప్రాంతంలో నివసించే రమేష్‌సింగ్ కైలాష్సింగ్ రాజ్‌పుత్, తన భార్య మంజుబెన్, చిన్న కుమార్తె కాజల్‌తో ఇంటి విషయాల గురించి మాట్లాడాడు. ఇంటి పనులు చేయకపోవడంపై కుమార్తెను ఆయన మందలించాడు. ఆమె చేతిలోని మొబైల్ ఫోన్ లాక్కుని నేలకేసి కొట్టాడు.కాగా, తండ్రి రమేష్‌సింగ్ చేసిన పనికి కుమార్తె కాజల్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. వెంటనే వంటగదిలోని ప్రెషర్ కుక్కర్ మూత తీసుకొచ్చి ఆయన తలపై పదేపదే కొట్టింది. ఆ తర్వాత కత్తితో తండ్రి కడుపులో ఆమె పొడవడంతో తీవ్ర రక్తస్రావమై ఆయన కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ సర్వీస్‌కు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని రమేష్సింగ్ను పరీక్షించారు. అప్పటికే ఆయన మరణించినట్లు నిర్ధారించారు.

