7tv focus : మణిపూర్‌లో రెండు ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన నలుగురు మిలిటెంట్లు మరణించారు. భయాందోళన చెందిన ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. మణిపూర్‌లోని నోనీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో టావోడైజింగ్ గ్రామంలో నాగా ప్రత్యర్థి వర్గాలైన జెలియాంగ్రాంగ్ యునైటెడ్ ఫ్రంట్ (జెంచుయ్ వర్గం) జెడ్‌యూఎఫ్(జే), నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగలిమ్ (ఎన్ఎస్సీఎన్-ఐఎం)కు చెందిన మిలిటెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. జెడ్‌యూఎఫ్(జే)కు చెందిన ముగ్గురు మిలిటెంట్లు, (ఎన్ఎస్సీఎన్-ఐఎం)కు చెందిన ఒక మిలిటెంట్ ఈ కాల్పుల్లో మరణించారు.కాగా, నాగా ప్రత్యర్థి వర్గాల ఘర్షణ, కాల్పులకు గ్రామస్తులు భయాందోళన చెందారు. తమ ఇళ్లను వీడి పారిపోయారు. ఇతరులను హెచ్చరించడానికి, ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా గ్రామస్తులు హెచ్చరించారు. నాగా ప్రత్యర్థి వర్గాల మధ్య కొన్ని గంటల వరకు నిరంతరాయంగా కాల్పులు జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు.

