7tv focus : వివాహేతర సంబంధం కొనసాగించవద్దన్నందుకు కన్న కొడుకునే చంపిందో తల్లి. తన ప్రియుడు, ఆ ప్రియుడి స్నేహితులతో కలిసి కుమారుడిని గొంతునులిమి చంపేసింది. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈనెల 1న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని విజయ్ నారాయణ్‌గా గుర్తించారు. బెంగళూరులోని ఆర్టీ నగర్లో అతను నివసించేవాడు. విజయ్ తల్లి మీనా నారాయణ్ ఒక బ్యూటీ పార్లర్లో మేనేజర్‌గా పనిచేసేది. మహారాష్ట్రకు చెందిన రాకేష్ జామునిని ఆమె తన డ్రైవర్‌గా నియమించుకుంది. ఈ క్రమంలో రాకేష్‌తో మీనా వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కుమారుడు విజయ్‌కు తెలియడంతో అతను వారించాడు. ఆ సంబంధం కొనసాగించవద్దని తల్లిని పలుమార్లు కోరాడు. అయినా.. ఆమెలో మార్పు రాలేదు.తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కొడుకును చంపాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు రాకేష్‌తో కలిసి కుట్రపన్నింది. కాగా.. ఈనెల 1న బెళగావిలో కర్ణాటక రాజ్యోత్సవాలు జరిగాయి. ఆ ఉత్సవాలను చూసేందుకు వెళదామని విజయ్ను బెళగావికి తీసుకెళ్లింది. అక్కడ ఒక శీతల పానీయంలో మత్తుమందు కలిపి విజయ్‌కు ఇచ్చింది. ఆ డ్రింక్ తాగాక అతను స్పృహ కోల్పోయాడు. తర్వాత విజయ్ను రాకేష్, అతని స్నేహితులు, విజయ్ తల్లి ఒక టవల్‌తో గొంతునులిమి చంపేశారు.

