7tv focus : చైనా గూఢచారిణిగా అనుమానాలు ఉన్న మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్న ఎన్విడియా సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సంస్థలో ఆయనను కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై సంస్థ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో, ప్రస్తుతం సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ బోర్డులో సభ్యురాలిగా భారత సంతతి మహిళ ఆర్తీ షా కూడా ఉన్నారు. సీఈఓ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే క్రమంలో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆర్తీ షా అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనుంది.
ఎవరీ ఆర్తీ షా..
భారత్లోనే పుట్టిపెరిగిన ఆర్తీ షా పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్సైడ్లో పీహెచ్డీ (అప్లైడ్ స్టాటిస్టిక్స్) చేశారు. ఆ తరువాత దాదాపు 27 ఏళ్ల పాటు ఫార్మాసుటికల్ దిగ్గజం ఎలీ లిల్లీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రీసెర్చ్, గణాంక విభాగం, బిజినెస్ మేనేజ్మెంట్ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఎల్లీ లిల్లీలో సీనియర్ వైస్ప్రెడిడెంట్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ స్థాయికి చేరుకుని ఆ తరువాత సంస్థను వీడారు. 2020 నుంచీ ఎన్విడియా బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఉన్నారు.

