7tv focus : సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు వంగ వెంకట్, జి.వీరస్వామి మాట్లాడారు. ఏఐటీయూసీ కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట రెండు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిర్వహించే రిలే నిరాహార దీక్షల్లో కార్మికులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రధానంగా మూడు డిమాండ్ల సాధన కోసం ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నాయకులు వెల్లడించారు.మొదటిగా ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి, గతంలో మాదిరిగా 100 శాతం డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటికే మెడికల్ ఫిట్ అయినప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సుమారు 200 మంది డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని కోరారు.

