7tv focus : ఇందిరమ్మ ఇళ్ల బిల్లు కేటాయింపులులబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. జీవనోపాధి కోసం క్యాబ్‌లు, మినీ వ్యాన్లు నడుపుతూ, ఉండేందుకు ఇళ్లు లేక ఇందిరమ్మ ఇల్లు కోసం పలువురు క్యాబ్ డ్రైవర్లు(దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు సమయంలో వారిని అర్హులుగా నిర్ధారించిన కేద్ర ప్రభుత్వం తీరా ఇల్లు నిర్మించుకున్నాక బిల్లు మంజూరు చేసే సమయంలో అనర్హులుగా గుర్తిస్తున్నది. క్యాబ్ డ్రైవర్లను కారు ఓనర్లుగా చూపుతూ బిల్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నది. కారు అమ్మేసినా అందని బిల్లులు అందక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

