చింతలపూడి 7 టివి ఫోకస్ జూలై 18
చింతలపూడి మండల న్యాయ సేవ కమిటీ చైర్మన్ కం జూనియర్ సివిల్ జడ్జి ఏబి అప్పారావు శనివారం కరగరాన్ని పర్యవేక్షించి నిందితులకు అందిస్తున్న ఆహార పదార్థాలు మంచినీటి సౌకర్యాలు అనారోగ్యంగా ఉన్నవారికి అందించే వైద్య సదుపాయాలు తదితర విషయాలు జైలు సూపర్నెంట్ ని అడిగి తెలుసుకున్నారు ఉచిత న్యాయ సలహాలు జైలు ముద్దాయిలకు అందించిన సహాయంపై ఆరా తీశారు అందరూ బాధ్యతగా పనిచేయాలని ఈ సందర్భంగా అన్నారు వంటశాల స్టోర్ రూములను తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపకారాగారా పర్యవేక్షణాధికారి కృపానందం జైలు సిబ్బంది ప్యానల్ లాయర్ సిహెచ్ వి నాగార్జున పి ఎల్ వి ఎండి అక్బర్ ఆలీ పాల్గొన్నారు

