టీవీ ఫోకస్, మిడ్జిల్ జూన్ 27: వ్యాపార సంఘం అధ్యక్షుడు గంజి కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ యువ నాయకుడు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ పవార్ తన సొంత నిధులతో కస్తూర్బా బాలికల వసతి గృహ విద్యార్థినులకు క్రీడా సామగ్రిని అందజేశారు. మిడ్జిల్ మండల వ్యాపార సంఘం అధ్యక్షుడు గంజి కృష్ణ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బీఆర్ఎస్ యువ నాయకుడు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ పవార్ సేవా కార్యక్రమం నిర్వహించారు. తన సొంత నిధులతో మిడ్జిల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ బరిగల సుదర్శన్, పార్టీ నాయకుడు పట్నం బంగారు పాల్గొని విద్యార్థినులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఇలాంటి కార్యక్రమాలు వారికి ప్రోత్సాహాన్నిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గంజి శేఖర్, ఆచారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యార్థినులు, ఉపాధ్యాయులు అభినందిస్తూ లక్ష్మణ్ పవార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

