7tv focus : కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కు అతడి నానమ్మ మరణవార్తను చెప్పలేదన్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులుతోసిపుచ్చారు. ఆ విషాద వార్తను అత్యంత సున్నితంగా ఆయనకు వెంటనే తెలియజేశామని, అంత్యక్రియల కు సొంతూరు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లలో సాయం చేస్తామని కూడా చెప్పామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు.తన కుమారుడికి నానమ్మ మరణవార్తను చెప్పలేదని దీప్కే తల్లి ఈ ఉదయం ఆరోపించారు. సీజేపీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేయడంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నేహా యాదవ్ విలేకరుల సమావేశంలో ఈ వీడియోను మీడియాకు ప్రదర్శించారు. సమాచారం అందిన వెంటనే దీప్కేకు నానమ్మ మరణవార్త గురించి, అంత్యక్రియలు జరిగే సమయం గురించి తెలియజేశామని నేహా యాదవ్ చెప్పారు. మానవతా దృక్పథంతో సొంతూరు వెళ్లేందుకు అవసరమైన సాయమూ అందిస్తామని చెప్పినట్లు తెలిపారు.

