7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 29: భవాని నగర్ కాలనీలో నిలిచిపోయిన యూజీడీ, సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోన్ జోనల్ కమిషనర్ హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని సుభాష్‌నగర్ డివిజన్ భవాని నగర్ కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఆకుల సతీష్ నేతృత్వంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జోనల్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు అసంపూర్తిగా ఉండటంతో మురుగునీరు రోడ్లపైకి వస్తోందని, నిల్వ నీటి కారణంగా అంతర్గత రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినతిని పరిశీలించిన జోనల్ కమిషనర్, సంబంధిత అధికారులు మూడు రోజుల్లో కాలనీని సందర్శించి పెండింగ్ పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూజీడీ పనులకు సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) అధికారులతో సమన్వయం చేసి సమస్యలను పరిష్కరిస్తామని, అలాగే పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆకుల సతీష్, నల్ల జైశంకర్ గౌడ్, పులి బలరాం, రవివర్మ, గిరిజ, నాగరాజ్ గౌడ్, మనీష్, హిమాన్షు దూబే తదితరులు పాల్గొన్నారు.

