7tv focus : మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్ సందర్శనకు హరీశ్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా నగరం నలువైపులా ‘టిమ్స్’ పేరుతో సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2022 ఏప్రిల్ 26న ఒకేరోజు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు సూపర్‌స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

