యాదాద్రి భువనగిరి7tv focus : యాదగిరిగుట్ట పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల వేట కోసం నల్లచెరువుకు వెళ్లిన ముక్కర్ల సత్తయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని చెరువులో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంత ప్రయత్నించినా సత్తయ్య ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. చివరకు శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఎస్డీఆర్ఎఫ్ రిస్క్ టీం, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యల్లో సత్తయ్య మృతదేహం లభ్యమైంది.మృతదేహాన్ని తహసీల్దార్ గణేష్ నాయక్, సీఐ బొడ్డుపల్లి భాస్కర్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్ సత్యనారాయణ, ఆర్ఐ, పోలీసులు పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీ ఐ భాస్కర్ తెలిపారు చేపల వేటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని చెరువులు, కుంటల్లో చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

