కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు సోమవారం చాలా స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (సోమవారం) ఉదయం10.00 గంటలకు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి ధర రూ.1,42,750గా ఉంది. (ఆదివారంతో పోలిస్తే కాస్త ధర పెరిగింది). అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,850గా ఉంది. ఇక వెండి కిలో ధర రూ.2,20,000గా ఉంది. (ఆదివారంతో పోలిస్తే ధర చాలా స్వల్పంగా పెరిగింది).

