బౌరంపేటలో స్థానికుల ఆరోపణలు
7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 1: బాచుపల్లి మండలం బౌరంపేటలోని ‘యువన్ విద్యామందిర్ స్కూల్ – కంప్లీట్ ఐఐటీ అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్’ అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకుండానే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి విద్యాసంస్థను నడుపుతున్నారని, అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బాచుపల్లి మండలం బౌరంపేటలోని ‘యువన్ విద్యామందిర్ స్కూల్ – కంప్లీట్ ఐఐటీ అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్’ అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకుండానే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి విద్యాసంస్థను నడుపుతున్నారని, అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.బాచుపల్లి మండలం బౌరంపేటలోని యువన్ విద్యామందిర్ స్కూల్ – కంప్లీట్ ఐఐటీ అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్ నిర్వహణపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే విద్యాసంస్థను నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో వి ద్యార్థుల భద్రతకు అవసరమైన ఫైర్ సేఫ్టీ అనుమతులు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు, సేఫ్టీ బాక్స్‌లు వంటి కనీస ప్రమాణాలు కూడా లేవని స్థానికులు పేర్కొంటున్నారు. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశంలో నిర్లక్ష్యం తగదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం నిర్దేశించిన విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, భవన భద్రత, సంబంధిత అనుమతుల విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలపై విద్యాశాఖ, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థ కొనసాగుతున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

