7tv focus : మానవత్వాన్ని మంటగలిపే హృదయవిదారక ఘటన మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని దిందా గ్రామంలో చోటుచేసుకుంది. అప్పుడే జన్మించిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ పరిసరాల్లో పడేసి వెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని ఆ పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నట్లు స్థానికులు గుర్తించారు.
గ్రామ పరిసరాల్లో పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.

