హెచ్‌సీయూలో కన్వెన్షన్ పోస్టర్‌ను విడుదల చేసిన ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) ఆధ్వర్యంలో ఆగస్టు 7, 2026న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు, మండల్ దివస్ జాతీయ కన్వెన్షన్ పోస్టర్‌ను నేడు హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం AIOBCSA జాతీయ కోఆర్డినేటర్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న

కన్వెన్షన్ పోస్టర్‌ను ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, స్వాభిమాన పోరాటాలకు మార్గదర్శకులని కొనియాడారు. పూలే చూపిన సామాజిక మార్పు దిశ నేటి తరానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. అలాగే మండల్ కమిషన్ ద్వారా సాధించిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ హక్కులను పరిరక్షించడం ప్రతి బహుజన సమాజం బాధ్యత అని అన్నారు. దేశంలో సామాజిక న్యాయంపై పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల ఐక్యత అత్యంత అవసరమని, ఈ జాతీయ కన్వెన్షన్ సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఒక కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ జాతీయ కన్వెన్షన్‌లో దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల నుంచి వందలాది మంది ఓబీసీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, యువజన నాయకులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా AIOBCSA రూపొందించిన ‘ఓబీసీల 10 కీలక డిమాండ్లు’ పై విస్తృత చర్చలు జరిగి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కులగణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, 50 శాతం పరిమితి తొలగింపు, ఉన్నత విద్యలో పూర్తి స్థాయి రిజర్వేషన్ల అమలు, రిజర్వేషన్లతో పదోన్నతులు, ప్రతి విశ్వవిద్యాలయంలో ఓబీసీ సెల్ ఏర్పాటు, ఫెలోషిప్‌లు మరియు స్కాలర్‌షిప్‌ల పెంపు, ఓబీసీ విద్యార్థుల సంక్షేమ చర్యలు, నిర్ణయాత్మక సంస్థల్లో ప్రాతినిధ్యం, సామాజిక న్యాయ విధానాల బలోపేతం వంటి అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో AIOBCSA జాతీయ అధ్యక్షులు డా. G కిరణ్ కుమార్, బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, సాయన్న ముదిరాజ్, కొండల్, డా. శ్రావణ్, గణేష్, జగదీష్, మేఘన, పావని, శివ, పవన్, వీరేష్, శివలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 7న హెచ్‌సీయూలో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశత జయంతి – మండల్ దివస్ జాతీయ కన్వెన్షన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, యువత, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక న్యాయాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) పిలుపునిచ్చింది.

