కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్

చౌటుప్పల్,జూన్ 04,(వార్త పత్రిక);ఆర్వో ఫిల్టర్ మరమత్తు పనులను చేయించి.. వార్డు ప్రజలకు త్వరలోనే ఫిల్టర్ ద్వారా త్రాగునీరు అందుబాటులోకి తెస్తానని కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అన్నారు. దివీస్ పరిశ్రమ, చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ల సహకారంతో చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం 13వ వార్డు రాంనగర్ కాలనీలో ఆగిపోయిన ఆర్వో ఫిల్టర్ మరమ్మతు పనులను కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గురువారం ప్రారంభించారు. మొదట బోరు మరమ్మతులను చేశారు. బోరులో సమృద్ధిగా నీరు ఉండడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల వాణి విప్లవ కుమార్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్వో ఫిల్టర్ చెడిపోయిందని వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. దివీస్ పరిశ్రమ సహకారంతోనే వాటర్ ఫిల్టర్ నిర్మించడంతో, వాటర్ ఫిల్టర్ మరమ్మత్తుల గురించి పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లానన్నారు. వెంటనే స్పందించిన యాజమాన్యం బోరు, ఫిల్టర్ మరమ్మతులను చేపట్టిందన్నారు. త్వరలోనే వార్డు ప్రజలకు ఫిల్టర్ వాటర్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వర్కాల కుమార్ గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్, మార్గం నర్సింహ్మ యాదవ్,
చెరుకు అశోక్ గౌడ్, గూయని జంగయ్య, చెరుకు సాయి గౌడ్, దివిస్ ప్రతినిధి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

