చౌటుప్పల్, అక్టోబర్ 07,(సెవెన్ టీవీ ఫోకస్);ప్రభుత్వ కార్యాలయాలంటేనే సమయపాలన ఉండాలి. కానీ చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఉదయం 11 గంటలు దాటినా కార్యాలయం తెరుచుకోకపోవడంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వివరాల్లోకి వెళితే… ఆస్తి రిజిస్ట్రేషన్లు, ఇతర పనుల కోసం ఉదయం నుండే ప్రజలు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే 09;30 గంటలకే తెరుచుకోవాల్సిన కార్యాలయం 11 గంటల వరకు తెరుచుకోలేదు. దీంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం సెలవు పెట్టుకుని వస్తే, అధికారులు రాకపోవడంతో తమ సమయం, డబ్బు వృధా అవుతోందని వాపోతున్నారు.
ఒక వైపు ప్రభుత్వం ప్రజలకు వేగంగా సేవలు అందించాలని చెబుతుంటే, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.కావున ఉన్నతాధికారులు స్పందించి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఆలస్యంగా వస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

