7tv focus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోనే అత్యున్నతమైన శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనా పురస్కారాలను ఎలాన్ మస్క్, సత్య నాదెళ్ల, జెన్సన్ హువాంగ్ తో పాటు ఇతర ప్రముఖ టెక్ దిగ్గజాలకు వైట్‌హౌస్‌లో ఇవాళ ప్రదానం చేయనున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డులను ప్రదానం చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వైట్‌హౌస్‌లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న’సైన్స్: ఎ న్యూ గోల్డెన్ ఏజ్ సమిట్’ వేదికగా ఈ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.
నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డు గ్రహీతలు:
- ఎలాన్ మస్క్ : టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ
- సెర్గీ బ్రిన్: గూగుల్ సహ వ్యవస్థాపకుడు
- జెన్సన్ హువాంగ్: ఎన్విడియా సీఈఓ
- లిసా సు: ఏఎమ్‌డీ (AMD) సీఈఓ
నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పురస్కారాలు:
- సత్య నాదెళ్ల: మైక్రోసాఫ్ట్ సీఈఓ
- మైఖేల్ డెల్: డెల్ టెక్నాలజీస్ సీఈఓ
గతేడాది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) నుంచి మస్క్ వైదొలిగిన తర్వాత, ట్రంప్ పన్ను, బడ్జెట్ బిల్లులపై విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అయితే ఇటీవల మస్క్ మళ్లీ ట్రంప్ యంత్రాంగంలో రక్షణ రంగానికి చెందిన ‘ప్రాజెక్ట్ మెరిడియన్’కు సహ నాయకత్వం వహిస్తూ రక్షణ సాంకేతికతపై సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అధ్యక్షుడు ట్రంప్‌కు ఈ అవార్డుతో ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది. ఆయన మేనమామ జాన్ జి. ట్రంప్ భౌతికశాస్త్రంలో చేసిన విశేష సేవలకుగాను గతంలో అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చేతుల మీదుగా మరణానంతరం ‘నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్’ అందుకున్నారు. సూపర్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా పరిశోధనలను వేగవంతం చేసి ప్రపంచంలో అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని నిలబెట్టడమే ఈ సమిట్ యొక్క ప్రధాన ఉద్దేశం.

