ఏలూరు 7 టివి ఫోకస్ జూలై 3
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు సందర్భంగా నిర్వహించిన హలో రైతన్న ఛలో ఏలూరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైతులు మహా ప్రదర్శన నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నలుమూలలు నుండి వచ్చిన అన్నదాతలు కదం తొక్కారు కళాకారుల డప్పు దరువులతో నృత్యాలతో ఉత్సాహపూరితమైన వాతావరణంలో నెలకొంది ఏలూరు నగరంలో నలుమూలల అరుణ పతాకాల అలంకరణలు రైతన్నల అడుగులతో హోరెత్తింది చిరుజల్లుల మధ్య అన్నదాతలు కిసాన్ సభ జెండాలతో ఏలూరు నగరంలో భారీ కవాతు నిర్వహించారు ముందుగా జూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుండి భారీ రైతాంగ ప్రదర్శన రైతన్నల నినాదాలతో ప్రారంభమైంది ఫైర్ స్టేషన్ మీదుగా జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వద్ద ఉన్న ఇండోర్ స్టేడియం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణం అవుతోందన్నారు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ కార్పొరేట్ లూటీకి పాల్పడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు అమెరికాలో ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ముప్పై రెండు లక్షల రూపాయల రాయితీలిస్తుంటే

భారతదేశంలో మాత్రం రైతులు చేసే వ్యవసాయాన్ని దండగ మారిన పనిగా మార్చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దేశానికి అన్నం పెడుతున్న రైతన్నల ఆత్మహత్యలు ప్రతి ఏటా పెరుగుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనేడు ఏళ్ల కాలంలో పది లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు భూమిపై పనిచేస్తూ పంట పండిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ముప్పై లక్షల మంది కౌలు రైతులకు ఎటువంటి రాయితీ అందడం లేదని ఇది ఎంతవరకు సమంజసమో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అమెరికా కార్పొరేట్ వ్యవసాయ అనుకూల విధానాలను ఈ దేశంలో అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం తహతహలాడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నోరెత్తకుండా భజనపరులుగా మారిపోయారని దుయ్యబట్టారు చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా మోడీ చట్టాలకు వంత పాడుతుంటే జగన్మోహన్ రెడ్డి మౌనం వహిస్తున్నారని రెండు వేరు వేరు మాత్రం కాదని అన్నారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో సాగునీరుతో పాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో సెలయేరులా పారుతుందని చెప్పారు గోదావరి జిల్లాలోని ఇలాంటి పరిస్థితుంటే కరువు జిల్లాలు వెనుకబడిన జిల్లాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఉదహరించారు చింతలపూడి ఎత్తిపోతల పథకం కి నాలుగు వేల కోట్ల రూపాయల కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తయిపోతుందని ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో నాలుగు లక్షల ఎకరాలకు ఎకరాలకు సాగునీరు అందుతుందని అయినా సరే పాలకులు నిధులు కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారన్నారు ఉచిత పంటల బీమా లేక రైతులు నష్టపోతున్నారని చెప్పారు ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటూనే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఎనబై వేల కోట్ల రూపాయలతో ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో సన్న చిన్న కారు మధ్యతరగతి రైతులు సేద్యం చేస్తుంటే ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు బహిరంగ సభకు రైతాంగ ఉద్యమ నిర్మాత కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి స్వగ్రామం పోతునూరు నుండి అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పాలకోడేరు మండలం మోగల్లు నుండి రైతు ఉద్యమ నాయకుడు గాదిరాజు శ్రీరామరాజు స్వగ్రామం భీమవరం నుండి ఆ చిత్రపటాలను తీసుకువచ్చి అఖిలభారత రాష్ట్ర నాయకులకు అందజేస్తూ నినాదాలు రూపంలో నివాళులర్పించారు వేదికపై అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి సాగర్ రాష్ట్ర సీనియర్ నాయకులు వై. కేశవరావు పోలవరం నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎం.సూర్యనారాయణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్. లింగరాజు మహిళా జిల్లా కన్వీనర్ ఎం.నాగమణి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.సీతారామయ్య కోన శ్రీనివాసరావు బొడ్డు రాంబాబు కోర్స జలపాలు ఆయా పి.ఆంజనేయులు కె.మోహనరావు హేమలత శివశంకర్ తదితరులు పాల్గొన్నారు 4 5 తేదీలలో డీసీఎంఎస్ కాన్ఫరెన్స్ హాల్లో రైతు సంఘం రాష్ట్ర మహాసభ కొనసాగనుంది

