7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: సనత్నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఓటరు జాబితాతో పాటు కుటుంబ సమగ్ర వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని హమాలీ బస్తీలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఎన్యుమరేటర్ పత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ఓటరు జాబితాలోని వివరాలతో పాటు కుటుంబ సమగ్ర సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. పేరు, వయస్సు, చిరునామా తదితర వివరాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు.
మరణించిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితాలో ఉంటే సంబంధిత ధ్రువపత్రాలతో వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అర్హులైన ఓటర్ల పేర్లు అనవసరంగా జాబితా నుంచి తొలగించబడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్యుమరేటర్లకు సరైన సమాచారం అందించి సహకరించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా శుద్ధి ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

