7tv focus : కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి మేనమామ వెంకట రాంరెడ్డి దళిత కుటుంబాన్ని గుడిలోకి రాకుండా అడ్డుకున్నాడని తెలిసిందే. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఓ దళిత వ్యక్తి తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి వెళ్లే క్రమంలో వారిని అడ్డుకున్న వెంకటరాంరెడ్డి ఈ గుడి మేము కట్టించాం.. మీరు ఎలా వస్తారంటూ అతనితో వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.మేం కట్టుకున్న గుడి లోపలికి మీరు ఎట్ల వస్తరు’ అని వనపర్తి జిల్లా మంగంపల్లిలో ఎస్సీ మాదిగ యువకుడిని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి మేన మామ.. ఆ భూమి ప్రైవేటు ల్యాండ్ అయితే పర్మిషన్ లేకుండా పోవడం బహుశా నేరమే. కానీ ఇది గ్రామ పంచాయితీ భూమిలో కట్టిన గుడి. అట్లాంటప్పుడు దేవాలయ ప్రవేశం నేరం ఎట్లయితది.. ? ఎమ్మెల్యే గారు ఇది వివక్ష కాదా..? అని ప్రశ్నించారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా మీరే పెద్దమందడి పోలీస్ స్టేషన్‌పై వెళ్లి మీ మేనమామపై కేసు పెట్టాలి. అరెస్ట్ చేయించాలి. లేకపోతే ఎస్సీ బస్తీలలో మీరు అడుగుపెట్టలేరని హెచ్చరించారు.ఇప్పుడు కాంగ్రెస్ మేఘారెడ్డి ఇంటి దగ్గర డప్పులు కొడతారా వేముల వీరేశం, దేవని సతీష్ గారు..? ఇప్పుడు అర్థం అయ్యిందా బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని ఎందుకు దగ్ధం చేశారో..?రేవంత్ రెడ్డి హోమ్ మంత్రి మీరే కదా, పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి. స్పీకర్ మీద దళిత xదళిత x దళిత అంటూ వల్లమాలిన ప్రేమ చూపించారు కదా..? ఇప్పుడు చూపించండి. అయినా బస్తీలల్ల గ్రామ దేవతలు ఎల్లమ్మ, మైసమ్మ, మారెమ్మ, సవారమ్న, పెద్దమ్మ, పోచమ్మ, సమ్మక్క, అరుంధతి అమ్మ లాంటి ఎందరో ప్రేమించే తల్లులుండగా, బాబాసాహెబ్ , కాన్షీరాం, జాంబవంతుడి లాంటి తండ్రులుండగా మనం ఎందుకు ఇన్ని అవమానాలు భరించి ఈ ‘పెద్ద’ దేవుళ్ల దగ్గర ‘పిలవని పేరంటాలకు’ పోవాలె, మాల – మాదిగ భయ్యాలు..? మీ సంకలల్ల ఉన్న పిల్లలకు ఈ వివక్ష అర్థం అయితే వారు పెద్దగయిన తరువాత ఈ అవమానాన్ని నిజంగా భరిస్తరా..? ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నవాడు, తెలిసి తెలిసీ ఇట్లాంటి అవమానాలు భరించడు. ఇకనైనా మారండి.. అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హితవు పలికారు.

