7tvfocus ప్రగతి నగర్ డివిజన్ (276) పరిధిలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు, HMWS&SB CMC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ గారు, జనరల్ మేనేజర్ శ్రీమతి నాగ పరిమళ గారు మరియు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సూరవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని స్టోరేజ్ ట్యాంక్‌ను పరిశీలించి, ప్రగతి నగర్ ప్రాంతంలో నెలకొన్న మంచినీటి కొరత సమస్యపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలను అత్యవసరంగా చేపట్టాలని అధికారులను కోరారు.అదేవిధంగా, ప్రస్తుతం మోర్ సూపర్ మార్కెట్ వెనుక ఉన్న నిల్వ ట్యాంకుల వద్దకు వెళ్తున్న వాటర్ ట్యాంకర్లను సూరవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని స్టోరేజ్ ట్యాంక్ వద్దకు మళ్లించే అవకాశాలను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిల్వ ట్యాంకర్లు చేరుకునేందుకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడం సమస్యగా గుర్తించి, ఈ అంశాన్ని సంబంధిత మంత్రి గారు మరియు విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ (VC) గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.అలాగే, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా గుర్తించి, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

