7tv focus : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను కూడా చంపేస్తామంటూ ఓ వ్యక్తి హెచ్చరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ చెప్పుకున్న ఆ వ్యక్తి.. రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పంజాబ్‌లోని మొహాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ బెదిరింపుల వ్యవహారం ఢిల్లీలోని తిలక్ నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ సందేశం కూడా పంపినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై నవంబర్ 6న మొహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ)కి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవాడినని చెప్పుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

