7tv focus : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చిక్కుల్లో పడ్డారు. టర్కీలోని అంతల్యాలో జరుగుతున్న సీవోపీ 31 (COP31) అంతర్జాతీయ వాతావరణ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆల్బనీస్, ఆస్ట్రేలియా వాతావరణ మార్పులు, ఇంధన శాఖ మంత్రి క్రిస్ బోవెన్ మధ్య సరదా సంభాషణకు సంబంధించిన వ్యాఖ్యలు మైక్రోఫోన్లో రికార్డై బయటకు వచ్చాయి. వీటిని స్థానిక జాతీయ మీడియా ప్రసారం చేయడంతో తీవ్ర చర్చకు దారితీశాయి.సీవోపీ 31 అంతర్జాతీయ వాతావరణ సదస్సు ప్రారంభం కావడానికి ముందు వేదికపై అల్బనీస్, క్రిస్ బోవెన్ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ను గుండెకు దగ్గరగా పెట్టుకోవద్దని, దాని వల్ల గుండె స్పందనపై ప్రభావం ఉండవచ్చని క్రిస్ బోవెన్కు అల్బనీస్ సూచించారు. దీనికి స్పందించిన బోవెన్.. ఫోన్ను గుండె దగ్గర పెట్టుకోవడం కంటే ప్యాంటు జేబులో పెట్టుకోవడంపైనే తనకు ఎక్కువ ఆందోళన ఉందని సరదాగా అన్నారు. దీంతో ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు. అయితే, ఈ సంభాషణను అక్కడి మైక్రోఫోన్ రికార్డు చేసింది. ఆ వీడియోను ఆస్ట్రేలియా జాతీయ మీడియా ప్రసారం చేయడంతో వీరి వ్యాఖ్యలు వైరల్గా మారాయి.

