ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని నిజాంపేట్ వాటర్ బోర్డులో జరుగుతున్న అవకతవకల పై సిపిఐ ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ పరమీలకు, డూప్యూటీ జనరల్ మేనేజర్ రజినీకాంత్ రెడ్డికీ పిర్యాదు చేయడం జరిగింది. అనంతరం సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని వికార్ సెక్షన్లో ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గృహకల్ప, డబుల్ బెదురూమ్స్, ఇంద్రన్న కాలనీ, ఎన్టీఆర్ నగర్, సాయి నగర్, రాజీవ్ గాంధీ నగర్లో మంచి నీళ్ల సరఫరా సరిగా జరగటం లేదు అని గుర్తు చేశారు.

పై కాలనిలో పాత మోటార్లు సరిగా పని చేయటం లేదు. అలాగే ఇందిరమ్మ కాలనిలో సబ్ వాల్స్ పాత అవ్వటం వల్ల సరిగా పని చేయటంలేదు. వాటిని వెంటనే రిపేర్ చేయాలనీ వారు డిమాండ్ చేశారు. అలాగే రాజీవ్ గృహకల్ప నుండి విజయ్ టింబర్ విల్స్ వరకు 200మీ.మీ వాటర్ పైప్ లైన్ కీ కలెక్షన్ ఇవ్వడం వల్ల మెన్ లైన్ కలెక్షన్ వారికీ నాలుగు నుండి ఐదు గంటలు మంచి నీళ్ల సప్లై వస్తుంది. మిగతా వారికీ గంట, అర్ద గంట మాత్రమే నీళ్లు సప్లై వస్తుంది. అని అన్నారు. అలాగే సర్వే నెంబర్- 90లో కట్టిన నిర్మాణాలకు కూడా అక్రమంగా వన్ ఇంచ్ కలెక్షన్ ఇచ్చారని వాటిని వెంటనే తొలగించాలని వారు. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఆశి. యాదయ్య, పొన్నకంటి దస్తగిరి, సమరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

