7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 2: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 24 డివిజన్లకు నూతనంగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి కోరారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 24 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులకు టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డివిజన్ అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని ఆయన సూచించారు. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ప్రతి డివిజన్లోని అన్ని బూత్ల పరిధిలో ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదులో పాల్గొనేలా పార్టీ శ్రేణులు చొరవ చూపాలని భూపతిరెడ్డి కోరారు.

