వరంగల్ 7tv focus : కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల పండుగకు సిద్ధమైంది. గురువారానికి (ఆగస్టు 20) సరిగ్గా 50 ఏళ్లు నిండాయి. 1976 ఆగస్టు 20న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వర్సిటీ పరిపాలన భవనానికి శంకుస్థాపన చేశారు. తెలుగు, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ విభాగాలతో సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1968లో ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా పోస్టుగ్రాడ్యుయేషన్ సెంటర్‌గా పురుడు పోసుకుంది.
తర్వాత 1976 ఆగస్టు 20న కాకతీయ యూనివర్సిటీ ఏర్పడింది. కేయూలో సామాజిక శాస్త్రాలు, సైన్స్, కామర్స్, లా, ఫార్మసీ, ఇం జనీరింగ్, ఎడ్యుకేషన్‌లో ఏటేటా వేలాదిమంది విద్యార్థులు విద్య నభ్యసిస్తున్నారు. తెలంగాణలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నిత్యం వర్ధిల్లుతోంది. ఉస్మానియా వర్సిటీ తర్వాత రెండో అతిపెద్ద వర్సిటీగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి విద్యను అందిస్తోంది. గతంలో కరీంనగర్ శాతవాహన వర్సిటీ స్థాపనకు ముందు ఉమ్మడి కరీంనగర్ విద్య కార్యకలాపాలన్నీ కేయూ నేతృత్వంలోనే నిర్వహించేవి.
50 ఏళ్ల ప్రస్థానం
కాకతీయ యూనివర్సిటీ 50 ఏళ్ల విద్యా ప్రస్థానం స్ఫూర్తితో భవిష్యత్ లక్ష్యాల వైపు పోతోంది. 2025లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ వేడుకలతో స్వర్ణోత్సవ సంబురాలను ఘనంగా ప్రారంభించారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణ, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంతో పాటు పరిపాలన సంస్కరణలు చేపడుతున్నారు.
పెరిగిన బడ్జెట్
కేయూకు గతంలో కంటే ప్రభుత్వం బ్లాక్ గ్రాంట్‌ను ఈ ఏడా ది కాస్త పెంచింది. ప్రభుత్వం అందించిన బడ్జెట్, బ్లాక్‌గ్రాంట్ సహకారంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయూలకు ప్రాధాన్యతను కల్పించారు.

