7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూలై 4: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, వారికి మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మరో ముందడుగు వేసింది. అల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మహిళా, పురుషుల బ్యారక్స్‌ను శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ ప్రారంభించారు. విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలంటే వారికి నాణ్యమైన వసతి, సంక్షేమ సౌకర్యాలు అత్యవసరమని ఈ సందర్భంగా కమిషనర్ డా. ఎం. రమేష్ పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో పోలీస్ సంక్షేమం కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

నూతనంగా నిర్మించిన మహిళా, పురుషుల బ్యారక్స్తో పోలీస్ సిబ్బందికి సురక్షితమైన, పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో విధి నిర్వహణలో సిబ్బందికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. బ్యారక్స్ ప్రారంభం పట్ల అల్లాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రిటిరాజ్, ఐపీఎస్, ఏసీపీ పి. నరేష్ రెడ్డి, అల్లాపూర్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

