ఆగస్టు 5న ఆలూరులో రాష్ట్ర మహాసభ – బోయ వాల్మీకి సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు
తుగ్గలి, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్) కర్నూలు జిల్లా ఆలూరులో ఆగస్టు 5వ తేదీన నిర్వహించనున్న బోయ వాల్మీకి సమితి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మహాసభ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.
రాష్ట్ర నలుమూలల నుంచి బోయ వాల్మీకి సమాజానికి చెందిన నాయకులు, యువత, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమాజ అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.ఆలూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఈ రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బోయ వాల్మీకి సమాజ ఐక్యతను చాటిచెప్పే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ మహాసభ ఏర్పాట్లను బివిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు తలారి వాల్మీకి అంజి పర్యవేక్షిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, బోయ వాల్మీకి సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ తప్పక హాజరై మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

