7tv focus : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 19 నుంచి 24 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

