7tv focus : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ పంపిణీ చేసిన రామాయణ్, సీన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాడు దిల్ రాజు. అయితే ఈ సమావేశంలో సినిమాల ఫలితాలు మరియు తన కెరీర్‌కు సంబంధించి కొందరు విలేకరులు అడిగిన కమ్‌బ్యాక్ అనే ప్రశ్నపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారీ తనను ఈ ప్రశ్న అడగడం పట్ల ఆయన అసహనం ప్రదర్శించారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తాను ఎప్పుడో ఇండస్ట్రీని విడిచి వెళ్లిపోయినట్లు, మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి వచ్చినట్లు “కమ్‌బ్యాక్” అనడం సరికాదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ టాలీవుడ్లోనే వరుస సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ రంగంలో బిజీగా ఉంటానని, నిరంతరం ప్రయాణం సాగిస్తున్న తనకు ప్రతిసారీ ‘కమ్‌బ్యాక్’ అనే పదం ఆపాదించడం బాగోలేదని తేల్చిచెప్పారు.

