కుత్బుల్లాపూర్, జూలై 8 (7 టీవీ ఫోకస్): మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహాదేవపురం–గాజులరామారంలో వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మహాదేవపురం–గాజులరామారంలో వైఎస్సార్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నాయకుడు సాతాల గోపాల్ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు వై. ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్, ఆరే శ్యామల, కారుమూరు వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన ప్రజాసేవలు, సంక్షేమ పాలనను స్మరించుకున్నారు. వైఎస్సార్ సేవా సంఘం సభ్యులు గంగిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి, మల్లు సురేందర్ రెడ్డి, వెంకటస్వామి రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మురళి నాయక్, రాంభూపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, సీతారాం, అంజి తదితరులతో పాటు వైఎస్సార్ అభిమానులు, జగనన్న సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ ఆశయాలను కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.


