
భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ) మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిడ్జిల్ మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (యస్.ఐ.ఆర్ ) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది అని శనివారం ఒక ప్రకటనలో మండల తహసిల్దార్ గంగాపురం రాఘవేందర్ రెడ్డి పేర్కొనారు.
ఈ కార్యక్రమంలో అన్ని బూత్ లెవల్ అధికారులు (బి.యల్.ఓ లు), గ్రామ పాలన అధికారులు (జి.పి.ఓ లు), పంచాయతీ కార్యదర్శులు పాల్గొని ఓటర్లకు ఈ యఫ్ ఫారాలు నింపడంలో సహాయం చేస్తున్నారని .
మండలంలో మొత్తం 24,792 మంది ఓటర్లు ఉండగా, నేటి వరకు 5,501 ఏన్యుమరేషన్ ఫారాలు మాత్రమే సంబంధిత బి.యల్.ఓ లకు తిరిగి అందాయి. కేవలం 22.21% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తైంది. ఇంకా 19,291 ఫారాలు ఓటర్ల వద్దనే ఉన్నాయి.
కార్యక్రమం గడువు సమీపిస్తున్నందున, ఓటర్లు తమ వద్ద ఉన్న ఏన్యుమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి వెంటనే సంబంధిత బి.యల్.ఓ కు అందజేయవలసిందిగా , ఏన్యుమరేషన్ ఫారాలు సమర్పించకపోతే, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో మీ వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఏర్పడి, ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని స్థానిక తహసిల్దార్ గంగాపురం రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రఘు, ఆర్.ఐ లు అంబిక , మాధవి ఉన్నారు.

