7tv focus : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు దివంగత రియల్ స్టార్ శ్రీహరి. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా తన గంభీరమైన గొంతు, సహజమైన నటన, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే శ్రీహరి అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు కూడా తీరని లోటుగా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆయన సినిమాలను గుర్తుచేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కాగా, తాజాగా శ్రీహరి కుటుంబానికి సంబంధించి ఓ శుభవార్త బయటకు వచ్చింది. ఆయన పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.దివంగత నటుడు శ్రీహరి, ఆయన భార్య శాంతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శశాంక్ శ్రీహరి కాగా, చిన్న కుమారుడు మేఘాంశ్ శ్రీహరి. వీరిలో శశాంక్ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శ్రీహరి కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే స్నేహితుల కుటుంబం నుంచే శశాంక్‌కు జీవిత భాగస్వామిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాబోయే వధువు పేరు సంజన అని సమాచారం.ఇరు కుటుంబాల మధ్య చాలాకాలంగా మంచి సాన్నిహిత్యం ఉండటంతో పెద్దలు ఈ వివాహ సంబంధాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో శశాంక్, సంజనల పెళ్లి విషయంపై ముందడుగు పడిందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇరు కుటుంబాల సభ్యులు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

