శంకుస్థాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 15
పట్టణపరిధిలో ని పేరంపేట రోడ్డు సాయి బాలాజీ టౌన్షిప్ పార్కు నందు
పట్టణానికి సంబంధించి
రూ.101 కోట్ల తో ఏర్పాటు చేయనున్న రక్షిత మంచినీటి పథకానికి చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం శంకుస్థాపనగావించారు.జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన భారీ మంచినీటి పథకానికి జరిగిన శంకుస్థాపనకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై పనులను ప్రారంభించారుఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నిధులతో ఈ పథకాన్ని చేపడుతున్నారు. మొత్తం అంచనా వ్యయంరూ.101.16 కోట్లు. ఇందులో రూ.85.38 కోట్లు పథకం నిర్మాణానికి, మిగిలిన రూ.15.78 కోట్లు 7 సంవత్సరాల పాటు నిర్వహణకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి కేటాయించారు.ఎర్రకాలువ నుంచి ఇంటింటికీ కుళాయి నీరు అందించే ఈ కార్యక్రమం ద్వారాకొంగువారిగూడెం వద్ద ఉన్న ఎర్రకాలువ జలాశయం నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసిన అనంతరం పట్టణంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సరఫరా చేయనున్నారు. ఈ పనులను హైదరాబాద్కు చెందిన సి-వెట్ కంపెనీ చేపట్టింది.2019లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకానికి అప్పటి టిడిపి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఏఐఐబీ రూ.80.35 కోట్లు మంజూరు చేసింది. అయితే ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో వైసీపీ హయాంలో పనులు నిలిచిపోయాయి.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని రీ-ఎస్టిమేట్ చేసి నిధులు పెంచి, నేడు మళ్లీ పనులు ప్రారంభించారు.ఏళ్లుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న జంగారెడ్డిగూడెం ప్రజలు ఈ పథకం ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పథకం పూర్తయితే పట్టణానికి సురక్షితమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సి-వెట్ కంపెనీ ప్రతినిధులు, స్థానిక కూటమి నాయకులు
పాల్గొన్నారు.పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ చిట్టిబోయిన రామలింగేశ్వర రావు నంబూరి రామచంద్ర రాజు దాసరి శ్యామసుందరి శేషు రావూరి కృష్ణ బొబ్బర రాజు పాల్ కుమార్ మండవ లక్ష్మణరావు గుమ్మడి ప్రసాద్ వలవల తాతాజీ బిజెపి నాయకులు తాడికొండ సుధాకర్ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి మారిశెట్టి సత్యనారాయణ చిట్రోజు తాతాజీ మహంకాళి రాంబాబు మాలికల నాగేశ్వరరావు వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీ సంకర లక్ష్మణరావు నీరుకొండ రాము
హాజరు అయ్యారు

