7tv focus : రైజింగ్ స్టార్ ఆసియాకప్ మెన్స్ టోర్నీ కోసం ఇండియా-ఏ జట్టును ప్రకటించారు. భారత జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ఇవాళ బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మను కెప్టెన్‌గా నియమించారు. రజిత్ పటిదార్ వైస్ కెప్టెన్సీ చేయనున్నారు. నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లో ఈ టోర్నీ జరగనున్నది. ఇటీవల కివీస్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన భారత జట్టు బృందంలోని ఆటగాళ్లు ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్నారు. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఫోకస్ పెట్టారు.ఫినిషర్ పాత్రను రింకూ సింగ్ పోషించనున్నాడు. ప్రభ్‌సిమ్రన్, కుమార కుషాగ్రా ..కీపింగ్ బాధ్యతలను చేపట్టనున్నారు. సూర్యాంశ్ షెడ్జ్, షాబాజ్ అహ్మద్, విప్రాజ్ నిగం, హర్షదూబే, తనుష్ కోటియాన్.. ఆల్రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. పేస్ బౌలింగ్‌లో హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్ ఉన్నారు. భారత జట్టు గ్రూపు బిలో ఉన్నది. దాంట్లో పాక్, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. నవంబర్ 20న నేపాల్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనున్నది. గ్రూపు ఏలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, హాంగ్‌కాంగ్, చైనా ఉన్నాయి.

