7tv focus : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 1688 ఖాళీలను నింపనుంది. సికింద్రాబాద్ జోన్లో 72 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఖాళీల వివరాలు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 700
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 200
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 600
ట్రైన్స్ క్లర్క్- 188
సికింద్రాబాద్ జోన్లో..
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్- 60
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 3
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్- 8
ట్రైన్ క్లర్క్- 1
అర్హతలు
గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి (10+2) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సరం పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అనర్హులు.
వయసు
అభ్యర్థుల వయసు 2027, జనవరి 1 నాటికి 28 నుంచి 30 ఏండ్లలోపు ఉండాలి.

